సినిమాల్లో అవకాశాల పేరుతో మోసం.. డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా
షార్ట్ ఫిలిమ్స్, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ పలువురు బాధితులు అంబర్పేట్ శివంరోడ్డులోని డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు.
Protest


హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.) షార్ట్ ఫిలిమ్స్, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ పలువురు బాధితులు అంబర్పేట్ శివంరోడ్డులోని డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

బాధితుల కథనం ప్రకారం.. డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్, అతని అనుచరులు శ్రీరామ్, లావణ్యలు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని నమ్మబలికి పలువురి నుంచి రూ.20 లక్షల చొప్పున వసూలు చేశారు. సినిమాలపై ఉన్న ఆసక్తిని ఆసరాగా చేసుకుని పలువురి నుంచి కోట్ల రూపాయల వసూలుకు పాల్పడ్డారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు ధర్నాకు దిగారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande