
హనుమకొండ, 12 సెప్టెంబర్ (హి.స.)
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కనకదుర్గ కాలనీ, వడ్డేపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సుధానగర్ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, ఎస్ఐఆర్ ప్రక్రియలో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన విచారణ కేంద్రాలను, కొత్తగా ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణకు చేపట్టిన స్పెషల్ క్యాంపెయిన్ను
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు సంబంధించిన నోటీసులను ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే అందించాలని బీఎల్ఎలకు సూచించారు. సెలవు రోజుల్లో ఉద్యోగులు, వ్యాపారులు సాధారణంగా తమ ఇళ్ల వద్ద అందుబాటులో ఉండే అవకాశం ఉన్నందున, బీఎల్సీలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మ్యాపింగ్ కాని ఓటర్లు, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లు ధ్రువీకరణ పత్రాలు సమర్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. చిన్నచిన్న లోపాలు లేదా వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలను యాప్లో అప్లోడ్ చేసి, నిబంధనల ప్రకారం విచారణ (హియరింగ్) ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు