గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలి.. ఏసీపీ మాధవి
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని హుజూరాబాద్ ఏసీపీ మాధవి సూచించారు.
Acp


హుజురాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత

వాతావరణంలో నిర్వహించేందుకు గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని హుజూరాబాద్ ఏసీపీ మాధవి సూచించారు.

శనివారం సైదాపూర్ పోలీస్ స్టేషన్లో మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించి ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతి గణేష్ మండపానికి సంబంధించిన వివరాలను పోలీస్ శాఖ సూచించిన ఆన్లైన్ లింక్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు.

మండపాల వద్ద విద్యుత్ వైర్లు, షార్ట్సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గణేష్ నిర్వాహకులు మండపాల వద్ద అందుబాటులో ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతలు, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏసీపీ స్పష్టం చేశారు.

గణేష్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande