
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ , 12 సెప్టెంబర్ (హి.స.)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కొనియాడారు. విజయవాడ అంబేడ్కర్ కళావేదిక నుంచి రాష్ట్రంలో క్రిటికల్ కేర్ బ్లాకులు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్లను సీఎంతో కలిసి నడ్డా ప్రారంభించారు. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడమంటే కేవలం భవనాలు నిర్మించడం కాదని, భవిష్యత్ తరాల కోసం బలమైన ఆరోగ్య మౌలిక వసతుల వ్యవస్థను సృష్టించడమేనని నడ్డా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనల మేరకు ప్రారంభించిన 'పీఎం-అభిమ్' పథకం కింద రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్