
ఆంధ్రప్రదేశ్ , 12 సెప్టెంబర్ (హి.స.)డీఎస్సీ నియామకాల్లో కూటమి ప్రభుత్వం అర్హతకు పెద్దపీట వేసిందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. కానీ వైఎస్సార్సీపీ మాత్రం ఫేక్ ప్రచారంతో క్రీడాకారులను అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ ఛాంపియన్గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ బాక్సర్ పెద్ద అప్పలరాజుకు డీఎస్సీలో టీచర్ ఉద్యోగం లభించడాన్ని వక్రీకరిస్తూ గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని లోకేశ్ మండిపడ్డారు. ఆయన సెమీఫైనల్ పోరాటానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ దూరదర్శన్లో ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రం గర్వించే క్రీడాకారుడిని అవమానించే ప్రచారాన్ని జగన్ ఇప్పటికైనా ఆపాలని హితవు పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్