వినాయక చవితి పండుగ.......కిటకిటలాడుతున్న మార్కెట్లు
ఈ నెల 14న వినాయక చవితి పండుగ సందర్బంగా కొన్ని విభిన్న రకాల వినాయక విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి. మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.
Ganesh idols


తెలంగాణ , 12 సెప్టెంబర్ (హి.స.)ఈ నెల 14న వినాయక చవితి పండుగ సందర్బంగా

కొన్ని విభిన్న రకాల వినాయక విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి. మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. చవితి వేడుకలకు ఒకరోజే సమయం ఉండడంతో మార్కెట్లకు పెద్ద సంఖ్యలో జనం తరలిరావడం వల్ల సందడి వాతావరణం నెలకొంది. గతంతో పోలిస్తే పూజా సామగ్రి ధరలు మరింత పెరిగాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పందిళ్లు, వీధులు, బహుళ అంతస్తు భవనాల్లోనూ ఉత్సవాల సన్నాహాలు జోరందుకున్నాయి. పర్యావరణహితం కోసం మట్టి విఘ్నేశ్వరుడ్నే పూజించాలన్న ఆసక్తి ప్రజల్లో పెరుగుతోంది. గణేశ్ ఉత్సవాలపై మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనిత సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని జిల్లాల ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి, గణేష్ ఉత్సవాల నిర్వహణ, మండపాలు, ఊరేగింపులకు అనుమతులపై సుదీర్ఘంగా చర్చించారు. అనుమతుల కోసం అమలు చేస్తున్న సింగిల్ విండో విధానంపై ఉత్సవ కమిటీలు, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande