బీఆర్ఎస్ నేతల భూ దందాల భాగోతం మొత్తం బయటపెడతాం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
22ఏ సమస్యకు బీఆర్ఎస్ నేతలే కారణమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. ఈ 22ఏ పై ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడతానని అన్నారు.
Anirudh Reddy


హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.) 22ఏ సమస్యకు బీఆర్ఎస్ నేతలే కారణమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. ఈ 22ఏ పై ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడతానని అన్నారు.

శనివారం అసెంబ్లీ వద్ద విలేకర్లతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల భూదందాల భాగోతం మొత్తం బయటపెడతామని తెలిపారు. వాళ్ల హయాంలోనే ప్రభుత్వ భూముల్లో వెంచర్స్ చేశారని విమర్శించారు.

భూబకాసురులు మేం కాదని.. గత పదేళ్ల నాయకులే దోచుకున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నిప్పులు చెరిగారు. 22ఏ పై విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ 22ఏలో కోటి16 లక్షల ఎకరాలు ఉన్నాయనేది అబద్ధమని స్పష్టం చేశారు. 40 ఏళ్లుగా జరిగిన తప్పుల వల్లే నిషేధిత జాబితాలో భూములు ఉన్నాయని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande