
హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జాతీయ మానవ హక్కుల కమిషన్ షాకిచ్చింది. మంత్రి కుటుంబంతో సంబంధం ఉన్న సంస్థగా పేర్కొంటున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థపై ఎన్ హెచ్ఐసీ౯ సీరియస్ అయింది.
రాజేంద్ర నగర్ మానస హిల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ తవ్వకాలు జరుపుతున్నారని అందిన ఫిర్యాదుపై రాఘవ కన్ స్ట్రక్షన్స్ సంస్థపై కేంద్ర స్థాయిలో విచారణ జరపాలని ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై రెండు నెలల్లో చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర గనుల శాఖ కార్యాదర్శికి స్పష్టం చేసింది.
ఈ మేరకు ఎన్హెన్ఆర్సీ ఆదేశాలు ఇచ్చినట్లు మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని తెలిపారు. బాధితులు/ఫిర్యాదుదారుడిని భాగస్వామ్యం చేస్తూ 8 వారాల వ్యవధిలో తగిన చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలపై రామారావు ఇమ్మనేనికి సమాచారం అందించాలని గనుల శాఖను ఆదేశించిందని వెల్లడించారు.
రాజేంద్రనగర్ మండలం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న మానస హిల్స్ ప్రాంతంలో ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండానే భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు కొండలను తవ్వేస్తున్నారని రామారావు తన ఫిర్యాదులో జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సరైన అనుమతులు, గనుల తవ్వకాల లీజు పత్రాలు ఏవీ లేకుండానే క్వారీ నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లాండ్ యూజ్ కన్వర్షన్, హెచ్ఎమ్ఐడీఏ, స్థానిక పంచాయతీ అనుమతులు,
పేలుడు పదార్థాల లైసెన్స్, భూగర్భ జలాల వినియోగ అనుమతులు ఏవీ లేకపోయినా రెవెన్యూ, మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు స్పందించకపోవడంపై తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు రామారావు వెల్లడించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్హెన్ఆర్సీ.. ఈ ఈ ఫిర్యాదుపై చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర గనుల శాఖ కోరినట్లు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ తనకు అధికారికంగా సమాచారం ఇచ్చిందని రామారావు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..