నేడు, రేపు 4 జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు
వరుస సెలవులతో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ మార్గంలో 4 జనసాధారణ్ ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Railway station name


హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.) వరుస సెలవులతో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ మార్గంలో 4 జనసాధారణ్ (అన్రిజర్వ్డ్) ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఈనెల 12, 13 తేదీల్లో మధ్యాహ్నం 12.10గంటలకు 07235 ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి, రోజుల్లో 07236 ప్రత్యేకరైలు సిర్పూర్ కాగజ్నగర్ నుంచి సాయంత్రం 6గంటలకు బయల్దేరుతాయని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande