
సిద్దిపేట, 12 సెప్టెంబర్ (హి.స.)
వ్యవసాయానికి నాణ్యమైన
విద్యుత్ను సక్రమంగా అందించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని వివిధ గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు.
విద్యుత్ కోతలతో పంటలకు సాగునీటిని అందించడం ఇబ్బందిగా మారడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్స్టేషన్లను ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
నంగునూరు మండలం కొండంరాజుపల్లి, రాజగోపాలపేట విద్యుత్ సబ్స్టేషన్లను రైతులు ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. నంగునూరు-ఖాతా రహదారి పై బైఠాయించి రాస్తారోకో చేశారు.
వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, కరెంటు కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గట్లమల్యాల, ఘనపూర్, ఖాతా, కొండంరాజుపల్లి, సంతోష్నగర్ గ్రామాలకు చెందిన రైతులు కొండంరాజుపల్లిలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని నినదించారు. ప్రస్తుతం విద్యుత్ కోతలు, సరఫరాలో అంతరాయాలతో సాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని రైతులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..