
అమరావతి, 12 సెప్టెంబర్ (హి.స.)
‘సూపర్ సిక్స్’ పథకాలతో ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతోందని అధికారులు తెలిపారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్: రైతు పెట్టుబడి అవసరాలను తీర్చడంతోపాటు సాగుకు ఆర్థిక తోడ్పాటును అందిస్తోందని వ్యవసాయ శాఖ సంచాలకుడు మనజీర్ జీలానీ సమూన్ వివరించారు. రాష్ట్రంలోని అర్హులైన భూ యజమానులు, ఆర్వోఎ్ఫఆర్ భూములను సాగు చేస్తున్న రైతు కుటుంబాలకు ఏటా రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతోందన్నారు.
2025-26లో మూడు విడతలుగా దాదాపు 46.86 లక్షల మంది రైతు కుటుంబాలకు మొత్తం రూ.8,985. 41 కోట్లు అందించామని చెప్పారు. 2026-27 ఖరీఫ్ సీజన్లో ఒక్కో రైతు కుటుంబానికి 7,000 చొప్పున 46.86 లక్షల కుటుంబాలకు రూ.3,125.47 కోట్లు అందించామన్నారు. ఇప్పటివరకు రూ.12,110.88 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయగా దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.8,903.10 కోట్లు, కేంద్రం(పీఎం-కిసాన్) వాటా రూ.3,207.78 కోట్లు ఉందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ