
త్రిప్రయార్, 12 సెప్టెంబర్ (హి.స.)ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళంలోని సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో విశిష్ట సేవల్లో ఒకటిగా పేరున్న దీపారధన సేవలో పాల్గొన్నారు. ఒక్కరోజు దీపారాధన సేవకు విరాళం అందించి, స్వయంగా దీపాలు వెలిగించి పవన్ సేవలో పాల్గొన్నారు. అంతే కాకుండా ఆలయం ప్రధాన ద్వారాం ఎదురుగా, శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధాన దీపాల్లో జ్యోతి ప్రజ్వలన చేశారు.
దీంతో పాటు ఆలయ సంప్రదాయాలు అనుసరించి మీనుట్టు, వేది వజిపాడు సేవలోనూ పవన్ పాల్గొన్నారు. శంఖుచక్రాలతో పాటు ధనస్సు, హారం ధరించిన శ్రీ రామస్వామి వారి అద్భుత రూపాన్ని దర్శించి, సంధ్యాకాల అర్చనలు నిర్వహించారు. స్వామివారితో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణుడికి, అయ్యప్పస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మాలవిరాట్టుకి కుడివైపు ఉన్న దక్షిణా మూర్తికి, నైరుతి దిక్కున ఉన్న వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
---
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV