ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి, 24 మందికి గాయాలు
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 24 మంది గాయపడ్డారు.
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి, 24 మందికి గాయాలు


ఏలూరు, 12 సెప్టెంబర్ (హి.స.)ఏపీలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 24 మంది గాయపడ్డారు.

ఈ ఘటన ఏలూరు జిల్లా చింతలపూడి యండపల్లి సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై తెల్లవారుజామున జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుండి విజయనగరం వెళుతున్న జగన్ ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది.

క్లీనర్ వైపు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండగా, తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. బస్సులోని 24మందికి గాయాలు కాగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో ఏపీలో చాలా బస్సు ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. బస్సు దగ్దం, యాక్సిడెంట్ ఇలా అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అర్దరాత్రులు ట్రావెల్ బస్సు ప్రమాదాలు పెరిగిపోయాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande