ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Rain


ఆంధ్రప్రదేశ్ , 12 సెప్టెంబర్ (హి.స.)

తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 18 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటలకు 40 కి.మీల లోపు ఊదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు హైదరాబాద్ లోనూ నేడు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది.

ఇక ఏపీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. అల్పపీడనం కొనసాగుతుండటంతో నేడు ఉత్తరాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 50 నుండి 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande