శ్రీశైలం మల్లన్న సేవలో పార్లమెంట్ లాంగ్వేజ్ సబ్ కమిటీ బృందం
శ్రీశైలం శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారిని 10 మంది భారత పార్లమెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ సబ్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు.
శ్రీశైలం


శ్రీశైలం, 12 సెప్టెంబర్ (హి.స.)శ్రీశైలం శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారిని 10 మంది భారత పార్లమెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ సబ్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు.

దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న సభ్యుల బృందానికి ఆలయ మర్యాదల అనుసరించి రాజగోపురం వద్ద ఆలయ ఈవో శ్రీనివాసరావు,అర్చకులు స్వాగతం పలికారు.

అనంతరం శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకొని మల్లికార్జునస్వామికి రుద్రాభిషేకం,అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో భారత పార్లమెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ సబ్ కమిటీ సభ్యులకు ఆలయ అర్చక,వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీస్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాలు, శ్రీశైలం స్థల పురాణం,చరిత్రకు సంబంధించిన శ్రీశైలం దేవస్థానం ప్రచురించిన కాపీటేబుల్ పుస్తకాన్ని భారత పార్లమెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ సబ్ కమిటీ సభ్యులకు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande