
ఆంధ్రప్రదేశ్ , 15 సెప్టెంబర్ (హి.స.)కోచింగ్ కేంద్రాల కార్యకలాపాలపై క్షేత్రస్థాయిలో నిఘా పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులను కొన్ని ప్రైవేటు కోచింగ్ సంస్థలు తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అభ్యర్థులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న వ్యవహారంపై అధికారులు సీఎంకు వివరించారు. పరీక్షల కోసం శిక్షణ పొందాల్సిన యువతను రాజకీయ కార్యక్రమాల్లోకి లాగడం ఏమాత్రం సమర్థనీయం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నిర్దేశిత మార్గదర్శకాలను పాటించాలి: ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల నియంత్రణా నిబంధనలు–2026 ప్రకారం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు తప్పనిసరిగా నిర్దేశిత మార్గదర్శకాలను పాటించాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా జీవో నెంబరు 9లోని నిబంధనలకు అనుగుణంగానే సంస్థల నిర్వహణ ఉండాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్