
తెలంగాణ , 15 సెప్టెంబర్ (హి.స.)22ఏ భూముల అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. బుధవారం అసెంబ్లీలో 22ఏ అంశంపై చర్చ జరగనున్న నేపథ్యంలో నిషేధిత భూముల విషయంలో నెలకొన్న సమస్యలు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటికి పరిష్కారం చూపే మార్గాలపై మంత్రుల సలహాలను సీఎం రేవంత్ రెడ్డి తీసుకోనున్నారని తెలుస్తోంది. 22ఏ జాబితాలో ఉన్న భూముల విషయంలో నిజమైన భూ యజమానులు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడకుండా అవసరమైన వెసులుబాటు కల్పించే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీలో కొనసాగనున్న చర్చలో 22ఏపై ప్రభుత్వం తరఫున స్పష్టత ఇచ్చేందుకు సీఎం రేవంత్రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్