
ఆంధ్రప్రదేశ్ , 15 సెప్టెంబర్ (హి.స.)కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎంపీ సానా సతీష్ కు లేఖ రాశారు. ఇన్కాయిస్ INCOIS కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదన కార్యరూపం దిశగా ముందుకు సాగుతోందని లేఖలో తెలిపారు. కాకినాడలో INCOIS లేదా NIOT ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాలని జులై 21న కేంద్ర మంత్రిని కలిసి సానా సతీష్ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ కాకినాడలో కేంద్రం ఏర్పాటుకు అనువైన భూమిని జిల్లా యంత్రాంగం గుర్తించినట్లు వెల్లడించింది. గుర్తించిన భూమికి సంబంధించిన ప్రతిపాదనను ఐ అండ్ ఐ శాఖ ఆమోదం కోసం అధికారులు పంపించారు. ఈ ప్రాంతీయ కేంద్రం అందుబాటులోకి వస్తే కాకినాడతో పాటు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మత్స్యకారులకు సముద్ర సమాచార సేవలు మరింత చేరువ కానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్