
ఆంధ్రప్రదేశ్ , 15 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్ర హోం మంత్రి అనిత నియోజకవర్గ అభివృద్ధిపై
సమీక్షా సమావేశం నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పాయకరావుపేట అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హోం మంత్రి అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గణనీయమైన రాయితీలు, సదుపాయాలను కల్పిస్తోందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఆమె నొక్కి చెప్పారు.
ఈ సమావేశంలో నీటిపారుదల, పంచాయతీ రాజ్, విద్యుత్, దేవాదాయ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్