దేవుడి గుడి కంటే ముందు విద్యార్థులే ముఖ్యం.. మంత్రి సీతక్క
జిల్లా పరిషత్ బాలుర కామారెడ్డి పాఠశాలలో రూ.5 కోట్ల నిధులుతో నిర్మించనున్న సమీకృత వసతుల భవన నిర్మాణానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు బడిలో ఉన్నా, ఇంటికి వెళ్లినా సెల్ ఫోన్లే చూ
Minister


కామారెడ్డి, 15 సెప్టెంబర్ (హి.స.)

జిల్లా పరిషత్ బాలుర కామారెడ్డి పాఠశాలలో రూ.5 కోట్ల నిధులుతో నిర్మించనున్న సమీకృత వసతుల భవన నిర్మాణానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు బడిలో ఉన్నా, ఇంటికి వెళ్లినా సెల్ ఫోన్లే చూస్తున్నారని, తల్లిదండ్రులు చదవమంటే ఫోన్ లోనే చదువుతున్నామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫోన్ చూస్తూ సమయం వృథా చేసుకుంటే భవిష్యత్తు దెబ్బతింటుందని, ఈ సమయంలో బాగా చదువుకుంటే కుటుంబానికి, రాష్ట్రానికి ఉపయోగపడతారన్నారు.

దేవుడి గుడి కంటే ముందు విద్యాలయాలే ముఖ్యమని, విద్యాలయాలే సమాజాన్ని మార్చే శక్తి అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్, స్కూల్ కిట్స్ నాణ్యతతో అందిస్తూ 2 వేల మంది విద్యార్థులు చదువుకునేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande