రాజమహేంద్రవరానికి త్వరలో మరో బైపాస్..... ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఏపీ ప్రభుత్వం రాజమహేంద్రవరం నగరానికి త్వరలో మరో బైపాస్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.
Rajamahendravaram


ఆంధ్రప్రదేశ్ , 15 సెప్టెంబర్ (హి.స.)ఏపీ ప్రభుత్వం రాజమహేంద్రవరం నగరానికి త్వరలో మరో బైపాస్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బైపాస్ నిర్మించాలనుకుంది. గోదావరి పుష్కరాల దృష్ట్యా రద్దీని తగ్గించేందుకు ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గించడం సహా భారీ వాహనాలు సిటీలోకి రాకుండా నివారించవచ్చు. వచ్చే ఏడాది జూన్లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని మరో బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande