సోకిలేరు వాగులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. వాగులో స్నానానికి దిగిన ఆరుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఒకరు గల్లంతయ్యారు.
సోకిలేరు వాగులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి


ఆంధ్రప్రదేశ్ , 15 సెప్టెంబర్ (హి.స.)విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. వాగులో స్నానానికి దిగిన ఆరుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఒకరు గల్లంతయ్యారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఆరుగురు స్నేహితులు విహారయాత్రకు వెళ్లారు. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకుని.. అక్కడి నుంచి రాజమహేంద్రవరం , అన్నవరం ఆలయ దర్శనం అనంతరం విశాఖపట్నం వెళ్లారు. అరకు, వంజంగి ప్రాంతాలను సందర్శించి మారేడుమిల్లి చేరుకున్నారు.

మారేడుమిల్లి నుంచి చింతూరు మండలం తులసిపాక గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని సోకిలేరు వ్యూ పాయింట్కు వెళ్లారు. అక్కడ వాగులో స్నానం చేసేందుకు దిగారు. వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఆరుగురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన అటవీ శాఖ, పోలీస్ అధికారులు స్థానికుల సహకారంతో ఐదుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విజయవాడకు చెందిన కోస్తూరి నీలేష్ (26) వరద నీటిలో గల్లంతవ్వగా మంగళవారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande