శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారం..... సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
తెలంగాణ ప్రభుత్వానికి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంలో చుక్కెదురైంది. హైదరాబాద్ లోని 40 ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ సంస్థకే చెందుతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
Supreme Court


తెలంగాణ , 15 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణ ప్రభుత్వానికి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంలో చుక్కెదురైంది. హైదరాబాద్ లోని 40 ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ సంస్థకే చెందుతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్కు వ్యతిరేకంగా తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ ను ఈ మేరకు సుప్రీంకోర్టు కొట్టేసింది. సికింద్రాబాద్ ప్రాంతంలో వివాదాస్పద భూమి ప్రైవేటు(శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్) వారికి చెందినదే అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కేవియట్ దాఖలు చేసింది. ఈ భూమి వ్యవహారంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కోర్టు ధిక్కరణ కేసు నమోదైన సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande