సచివాలయంలో మాజీ మంత్రి కొండా సురేఖకు కేటాయించిన గదులు సీజ్
హైదరాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మాజీ మంత్రి కొండా సురేఖకు కేటాయించిన గదులను అధికారులు సీజ్ చేశారు. సెక్రటేరియట్ లోని 4వ అంతస్తులోగల 4F విభాగంలోని 10, 11, 12 నంబర్ కార్యాలయ గదులకు తాళం వేసి సీల్ వేశారు. మంత్రిగా పదవిలో ఉ
Konda Surekha


హైదరాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మాజీ మంత్రి కొండా సురేఖకు కేటాయించిన గదులను అధికారులు సీజ్ చేశారు. సెక్రటేరియట్ లోని 4వ అంతస్తులోగల 4F విభాగంలోని 10, 11, 12 నంబర్ కార్యాలయ గదులకు తాళం వేసి సీల్ వేశారు. మంత్రిగా పదవిలో ఉన్న సమయంలో ఈ గదులను ప్రభుత్వం కొండా సురేఖకు కేటాయించింది. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు కేటాయించిన చాంబర్లను సెక్రటేరియట్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని, వాటికి తాళాలు వేసి సీల్ వేసేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande