
ఆంధ్రప్రదేశ్ , 15 సెప్టెంబర్ (హి.స.)కళియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం మూడు పూటలా నైవేద్య కైంకర్యాలు జరుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఆయా సమయాలకు అనుగుణంగా 20 అన్నప్రసాదాలు, 25 రకాల పిండి వంటకాలను బాలాజీకి సమర్పిస్తారు. ఆలయ పోటులో నైవేద్య పదార్థాలను ఎంతో పవిత్రతతో సిద్ధం చేస్తారు. నైవేద్యం తయారీలో ఉపయోగించే పదార్థాలు, పాత్రలు, తయారీ విధానాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. సాయంకాల కైంకర్యాల అనంతరం నిర్వహించే శయనభోగంలో భాగంగా అర్ధరాత్రి సమయంలో స్వామివారికి తిరువీసం అనే ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. రోజులో చివరిగా జరిగే ఏకాంత సేవలో వెచ్చని పాలు, సీజనల్ ఫ్రూట్స్, నెయ్యిలో వేయించిన డ్రైఫ్రూట్స్ను ఏడుకొండలవాడికి నివేదిస్తారు. శ్రీవారికి సమర్పించే ప్రతి నైవేద్యానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్