రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి.... వికారాబాద్ జిల్లా కలెక్టర్
వికారాబాద్ జిల్లా పరిధిలోని కొడంగల్ నియోజకవర్గం అంగడి రాయిచూర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Collector


వికారాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.) వికారాబాద్ జిల్లా పరిధిలోని

కొడంగల్ నియోజకవర్గం అంగడి

రాయిచూర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని హాజరు పట్టిక, స్టాక్ రిజిస్టర్తో పాటు మందులు, వైద్య సామగ్రి నిల్వలను పరిశీలించారు.

రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించిన కలెక్టర్.. వారికి అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రోగులకు నాణ్యమైన వైద్యం, మందులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆసుపత్రిలో సరిపడా వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వోకు ఫోన్ ద్వారా ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande