
ఆంధ్రప్రదేశ్ , 15 సెప్టెంబర్ (హి.స.)వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళా రైతు రేవంతన్నా రైతులను ఆదుకోవాలని ఫ్లెక్సీని ఏర్పాటు చేసి నిరసన తెలిపింది. ఈ సంవత్సరం అప్పు తెచ్చి పంట వేస్తే వర్షాలు కురవక, కాలువలో కూడా నీరు వదలక పంట ఎండిపోయిం దని ఆవేదన రైతు చెందారు. పంట కోసం అప్పులు చేశామని, బ్యాంకు లోన్ కట్టే పరిస్థితిలో లేమని రైతులను ఆదుకోవాలని పొలంలో ఫ్లెక్సీ కట్టి సదరు మహిళా రైతు లక్ష్మి నిరసన తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్