ఇద్దరి ఆస్తులపై విచారణ జరపాలి.. కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
KTR


హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.) సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పదవికి రేవంత్ కళంకం తెస్తున్నారని.. అన్ని రంగాల్లో రేవంత్ ప్రభుత్వం అట్టర్ఫ్లాప్ అంటూ వ్యాఖ్యానించారు.

ఇది సర్వభ్రష్ట ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు. శిఖర సమానమైన కేసీఆర్పై రేవంత్ నోరుపారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు కేసీఆర్కు వెయ్యి ఎకరాలు ఉన్నాయన్నారని.. ఇప్పుడేమో కేసీఆర్కు 67 ఎకరాలు ఉన్నాయంటున్నారన్నారు. కేసీఆర్కు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ పుట్టినప్పుడు ఇల్లు రెండెకరాల్లో ఉండేది..మా తాతకు వందల ఎకరాల భూమి ఉండేది. ఇప్పుడు 67 ఎకరాల భూమి ఉండటం తప్పా?.. నేను యూఎస్లో ఉద్యోగం చేసి సంపాదించుకున్నా. మా కులం వాళ్లందరి ఆస్తులు కేసీఆర్ ఖాతాలో వేస్తే ఎలా? కేసీఆర్ ఆస్తులు.. రేవంత్రెడ్డి ఆస్తులపై... హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సీఎం రేవంత్ మా సవాల్ను స్వీకరించాలి.. మేం ఎలాంటి శిక్షకైనా సిద్ధం’ అంటూ సవాల్ విసిరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande