ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం సమాజం ఉద్యమించింది .. భట్టి విక్రమార్క
ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.
Bhatti


ఖమ్మం, 17 సెప్టెంబర్ (హి.స.)

ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాడు యావత్ సమాజం ఉద్యమించిందని అన్నారు.

1948 సెప్టెంబర్ 17వ తేదీకి చరిత్రలో ఒక విశిష్టత ఉందని భట్టి విక్రమార్క అన్నారు. 77 ఏళ్ల క్రితం ఇదే రోజున తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగంగా మారి, ప్రజాస్వామిక ప్రజా పాలన దశలోకి పరివర్తన చెందిందన్నారు.

స్వాతంత్ర్యం పొందిన సమయంలో దేశం రెండు రకాల పరిపాలన ప్రాంతాలుగా ఉండేదని తెలిపారు. బ్రిటిష్ వారు ప్రత్యక్షంగా పరిపాలించిన బ్రిటిష్ ఇండియా ఒక భాగం కాగా, స్వదేశీ రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలు రెండో భాగంగా ఉండేవని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande