వాళ్లకు భయపడి చరిత్రను దాచిపెట్టారు.. కిషన్ రెడ్డి
తెలంగాణలో రజాకార్లు మారణకాండ సృష్టించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Kishan reddy


హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.) చరిత్రను ఎవరూ దాచిపెట్టలేరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో రజాకార్లు మారణకాండ సృష్టించారని తెలిపారు.

రజాకార్ల దాష్టీకాన్ని గత పాలకులు తొక్కిపెట్టారని విమర్శించారు. చరిత్రను కాంగ్రెస్, బీఆర్ఎస్ దాచిపెట్టాలని చూశాయని ఆరోపించారు. మజ్లిస్కు భయపడి చరిత్రను దాచిపెట్టారని మండిపడ్డారు. అసెంబ్లీలో నిజాం పాలకులను సీఎం రేవంత్ రెడ్డి పొగిడారన్నారు.

నిజాం మంచివాడైతే ఉద్యమాలు ఎందుకు వచ్చాయని.. పోరాటాలు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నిజాం మంచివాడైతే ఆపరేషన్ పోలో ఎందుకు చేయాల్సి వచ్చిందని నిలదీశారు. రేవంత్ ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande