
మెదక్, 17 సెప్టెంబర్ (హి.స.) విద్యుత్తు సరఫరాలో సమస్యలు మరియు అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ మెదక్ జిల్లా రైతులు పాపన్నపేట మండల AE కార్యాలయం ముందు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ కోతల వల్ల పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి వస్తుందన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నట్టు రైతులు వాపోయారు.
నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తే తప్ప పంటలను కాపాడుకునే పరిస్థితి లేదన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ సరఫరా పై వాస్తవ పరిస్థితిని AE వచ్చి వివరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మెదక్ -బొడ్మట్ పల్లి రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..