
హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.) మెడికల్ స్టోర్లలో ఇకపై సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి చేయాలని తాజాగా కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రతిపాదన చేసింది.
ఇందుకోసం ఇప్పటికే ఉన్న డ్రగ్స్ రూల్స్, 1945 చట్టంలోని రూల్ 65కు సవరణలు చేయాలని ప్రతిపాదించింది. సెప్టెంబర్ 8న దీనిపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ ఉన్న డ్రగ్స్ మాత్రమే అమ్మేలా చూడాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది.
సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్స్ రాసే ప్రిస్క్రైబ్డి మెడిసిన్స్ మాత్రమే అమ్మేలా పర్యవేక్షించే వీలుంటుంది. డ్రగ్స్ విక్రయ చట్టం బలంగా అమలవుతుంది. డ్రగ్స్ (అమెండ్మెంట్) రూల్స్, 2026, సబ్ రూల్ 2ఏ పేరుతో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇప్పటికే ఉన్న రూల్ 65, సబ్ రూల్ 2 తర్వాత దీన్ని ప్రతిపాదించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..