
వరంగల్, 17 సెప్టెంబర్ (హి.స.)
హనుమకొండ వరంగల్ ను సమగ్రంగా అభివృద్ధి చేసి హైదరాబాదుకు ధీటుగా తీర్చిదిద్దాలన్నది ప్రజా ప్రభుత్వం సంకల్పం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఇప్పటికే హనుమకొండ వరంగల్ ప్రాంతాలను హైదరాబాదుతో సమానంగా అభివృద్ధి చేయాలని దిశగా బృహత్తరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తో దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
రోడ్లు త్రాగునీరు డ్రైనేజీ పారిశుధ్యం వంటి మౌలిక వసతులను ఇప్పటి అవసరాలకే కాకుండా భవిష్యత్తు జనాభా పెరుగుదలకు అనుగుణంగా తీర్చి దిద్దుతున్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..