శ్రీకాళహస్తిలో ప్రధాని మోడీ 76వ జన్మదిన వేడుకలు
శ్రీకాళహస్తిలో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం., స్వయంగా రక్తదానం చేసి ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్.
srikalahasthi-mega-blood-donation-camp-held-for-pm-modi-


శ్రీకాళహస్తిలో, 17 సెప్టెంబర్ (హి.స.)భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో బీజేపీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీకాళహస్తి పట్టణంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు ఈ రోజు ఉదయం తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతీ ఆడిటోరియం (మధు హోటల్)లో సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ స్వయంగా రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా పరిపాలనలో దేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. 2047 నాటికి భారత్ను ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలపాలనే సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి రక్తం అందించేందుకు యువత, పార్టీ శ్రేణులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande