ఏపీలో 10 రెసిడెన్షియల్ స్కూళ్లు ఇక ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’
రాష్ట్రంలోని పది ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లను ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ అభివృద్ధి చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
AP Govt


అమరావతి , 19 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలోని పది ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లను ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ అభివృద్ధి చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలు, పోటీ పరీక్షలకు శిక్షణ, వృత్తి ఆధారిత కోర్సులను అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నట్లు సమాచారం.

ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ 59వ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తాడికొండ, కోడిగెనహళ్లి రెసిడెన్షియల్ స్కూళ్లు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్గా పనిచేస్తున్నాయి. తాజాగా మరో పది సంస్థలను ఈ విధానంలోకి తీసుకురావడంతో రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంచే ప్రయత్నం మరింత విస్తరించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande