కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్సకు ప్రభుత్వం చర్యలు
కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్సా సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
Medical


అమరావతి , 19 సెప్టెంబర్ (హి.స.)కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్సా సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సుమారు రూ.36.65 కోట్ల వ్యయంతో హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్, సీటీ స్కాన్ వంటి ఆధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు ONGC తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తోంది. ప్రస్తుతం కాకినాడ GGHలో క్యాన్సర్ రోగులకు రేడియేషన్ చికిత్స కోసం టెలికోబాల్ట్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే లీనియర్ యాక్సిలరేటర్ అందుబాటులోకి వస్తే కణితి ఉన్న ప్రాంతాన్ని మరింత కచ్చితంగా లక్ష్యంగా చేసుకుని రేడియేషన్ అందించే అవకాశం ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande