
హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)
దానం నాగేందర్ పై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. దానం పొలిటికల్ ట్రాక్ రికార్డును తీవ్రంగా తప్పుపట్టారు.
గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ కి వచ్చారు.. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువా కప్పుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. ఇప్పుడు ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వస్తే ఆయనకు ఓటమి తప్పదు అని రఘునందన్ రావు స్పష్టం చేశారు. రాబోయే ఖైరతాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. దానం నాగేందర్కు ఉప ఎన్నికలు ఎప్పుడూ కలసిరావు. గతంలోనూ ఆయన ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు