
హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.) ప్రజాస్వామ్యంలో ఓటర్ల ద్వారా
ఎన్నికైన తర్వాత పార్టీ మారి, ప్రజల తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తే, ఫిరాయింపు నిర్ధారణైన వెంటనే పదవి రద్దయ్యే విధంగా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లోపాలను సరిచేయకుండా వదిలేయడం వల్ల దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిణామాలు జరుగుతున్నాయని వారు అన్నారు. నేడు హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. ఈ దుస్థితికి జాతీయ స్థాయిలో గతంలో పాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కూడా బాధ్యత వహించాలన్నారు.
గతంలో కాంగ్రెస్ తప్పు చేసి ఉంటే, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఆ లోపాలను సరిచేసే అవకాశం ఉంది. మరి ఎందుకు సరిచేయడం లేదు? ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేలా చట్టాన్ని కఠినతరం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు