
నారాయణపేట, 20 సెప్టెంబర్ (హి.స.)
ఈనెల 24న గురువారం మక్తల్ పట్టణంలో నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి మినీ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టిన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం ఉదయం పరిశీలించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ దాదాపు 50 పైన వినాయకులు పూజలు అందుకుంటున్నారని, మంగళవారం నుంచి నిమజ్జనానికి తరలివస్తాయని, అందుకు అధికారులు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు.చెరువులో నీటిమట్టం తక్కువ ఉన్నందున ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా ఎస్పీ వినీత్ కు సూచించారు.
శోభాయాత్ర సందర్భంగా విద్యుత్ సరఫరా ఏర్పాటు తదితర విషయాల్లో విద్యుత్ అధికారులు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..