ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి ఆదివారం భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు.
Bada Ganesh


హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)

ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి

ఆదివారం భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. క్యూలైన్లన్నీ నిండిపోగా.. రోడ్డుపై భక్తులు గుంపులు గుంపులుగా దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాలు జరుగుతుండటంతో.. ట్యాంక్ బండ్ పరిసరాలు సైతం రద్దీగా మారాయి. బడా గణేష్ ను దర్శించుకున్నవారంతా ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనోత్సవాలను చూసేందుకు ఉత్సాహంగా వెళ్తున్నారు.

దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రాన్ని తలపిస్తోంది. ఇక నగరమంతా వివిధ థీమ్స్ తో ఏర్పాటు చేసిన గణేషులను వీక్షించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande