అక్టోబర్ 10 నుండి పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులు
తెలంగాణలోని విద్యాసంస్థలకు దసరా పండుగ కానుకగా 13 రోజుల పాటు పాఠశాలలకు వేసవి విరామం తరహాలోనే సుదీర్ఘ సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది.
School


హైదరాబాద్ , 20 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణలోని విద్యాసంస్థలకు దసరా పండుగ కానుకగా 13 రోజుల పాటు పాఠశాలలకు వేసవి విరామం తరహాలోనే సుదీర్ఘ సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగ వి సెలవులు అక్టోబర్ 22 వరకు కొనసాగుతాయి. తిరిగి అక్టోబర్ 23వ తేదీన బడులు తెరుచుకోనున్నాయి.

అయితే ఈ సెలవుల కంటే ముందే విద్యార్థుల మొదటి విద్యా సామర్థ్యాల మూల్యాంకనం (SA-1) ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. అక్టోబర్ మొదటి వారం నుంచే (అక్టోబర్ 1 నుంచి 9 వరకు) అన్ని తరగతులకు ఎస్ఏ-1 పరీక్షలను పూర్తి చేసి, ఆ తర్వాతే విద్యార్థులను దసరా సెలవులకు పంపనున్నారు. అటు ఇంటర్మీడియట్ బోర్డు కూడా కళాశాలలకు అక్టోబర్ 10 నుంచి 21 వరకు దసరా సెలవులను ప్రకటించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande