
తిరుమల, 20 సెప్టెంబర్ (హి.స.)తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాల సందడి తారస్థాయికి చేరుకుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వచ్చిన భక్తులతో తిరుమాడవీధులు కిక్కిరిసి కనిపిస్తున్నాయి.
ఈ రోజు ఆదివారం ఉదయం స్వామివారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 31 కంపార్టుమెంట్లు ఫుల్లయ్యాయి. ఉదయం 8 గంటల తర్వాతి నుంచి క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు శ్రీవారి దర్శనానికి 8-10 గంటల సమయం, రూ.300 శీఘ్రదర్శనానికి 3-5 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.
నేడు ఉదయం మలయప్పస్వామి కోదండరాముడి అవతారం.. హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తుల్ని కటాక్షించారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవం, రాత్రి 7 గంటలకు గజవాహన సేవ నిర్వహించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV