మహనీయుల త్యాగాల స్వేచ్ఛ విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలి.....చాగంటి కోటేశ్వరరావు
మహనీయుల త్యాగాల పునాదులపై నిర్మితమైన స్వేచ్ఛ విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు.
Chaganti


అమరావతి , 20 సెప్టెంబర్ (హి.స.)మహనీయుల త్యాగాల పునాదులపై నిర్మితమైన స్వేచ్ఛ విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమంలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ......అండమాన్లోని కాలాపాని జైలు గురించి చదివితే వారి త్యాగాలు మనసును కదిలిస్తాయి అన్నారు. ఇరుకైన గదుల్లో వారు అనుభవించిన నరకం ఊహకు అందనిది అని వివరించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు బ్రిటిష్ పోలీసుల తుపాకీకి గుండెను అడ్డుపెట్టి ‘ఆంధ్రకేసరి’ అయ్యారు అని తెలిపారు. పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కేవలం గొప్ప గాయకుడే కాదు, స్వాతంత్య్ర ఉద్యమంలోనూ పాల్గొన్నారన్నారు.

ఎందరో మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మనకు ఈ స్వేచ్ఛను అందించారన్నారు. కేవలం ఆ స్వేచ్ఛను అనుభవించడమే కాదు, దాని వెనుక ఉన్న త్యాగాల విలువను అర్థం చేసుకుని, దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత” అని ఉద్బోధించారు. పొట్టి శ్రీరాములు గారి అంతిమయాత్రలో దేశభక్తి గీతాలు పాడుతూ చివరి వరకు నడిచారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande