
ఆంధ్రప్రదేశ్ , 20 సెప్టెంబర్ (హి.స.)బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు రాష్ట్రంలో నెలకొన్న నీటి పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణకు లభించే కృష్ణా జలాల వినియోగంపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
శ్రీశైలం నుంచి 84 టీఎంసీల నీటిని వినియోగించినట్లు అసెంబ్లీలో మంత్రి పేర్కొన్నారని, ఆ లెక్కలపై స్పష్టత ఇవ్వాలని హరీశ్రావు ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కృష్ణా జలాల వినియోగం అత్యల్ప స్థాయికి చేరిందని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితి వల్ల సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి రంగాలపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. . అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతకు సంబంధించిన పరిశీలనలపై ఆయన కొన్ని వాదనలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్