
జోగులాంబ గద్వాల, 20 సెప్టెంబర్ (హి.స.) జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ గేట్లు తిరిగి మూసివేయడంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త
పరిస్థితులు నెలకొన్నాయి.
పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గంటల తరబడి ఆందోళన చేసినా అధికారులు స్పందించకపోవడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రైతులు జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ రెగ్యులేటర్ వద్దకు చేరుకుని గేట్లు ఎత్తి స్వయంగా నీటిని విడుదల చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అధికారులు గేట్లను తిరిగి మూసివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో సాగునీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. .
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు