దళితుల భూములకు ప్రభుత్వం పూర్తి రక్షణ.. మంత్రి పొంగులేటి
దళితులు, గిరిజనుల భూములకు సంబంధించిన ఒక్క అంగుళం భూమిని కూడా ప్రభుత్వం తీసుకోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.
Minister


హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)

దళితులు, గిరిజనుల భూములకు సంబంధించిన ఒక్క అంగుళం భూమిని కూడా ప్రభుత్వం తీసుకోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం దళితుల భూములకు సంపూర్ణ రక్షణగా నిలుస్తుందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల క్రితం దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, పేదల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎప్పుడూ ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande