కాకినాడ నుంచి మహారాష్ట్రకు రైలులో కాగితపు గుజ్జు.. దక్షిణ తీర రైల్వే సరికొత్త రికార్డు!
కాకినాడ నుంచి మహారాష్ట్రకు రైలులో కాగితపు గుజ్జు.. దక్షిణ తీర రైల్వే సరికొత్త రికార్డు!
train


కాకినాడ 20 సెప్టెంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ఓడరేవు నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు రైలు మార్గంలో కాగితపు గుజ్జు (ఉడ్ పల్ప్) రవాణాను దక్షిణ తీర రైల్వే మొదటిసారిగా విజయవంతంగా చేపట్టింది. గత పదిహేనేళ్లుగా దాదాపు 1,061 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేపర్ పరిశ్రమలకు ఈ ముడిసరుకు కేవలం లారీల ద్వారానే సరఫరా అయ్యేది.

సరుకు రవాణా ధరలను సరసమైన స్థాయిలో సవరిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవడంతో వ్యాపారులు రోడ్డు మార్గానికి స్వస్తి చెప్పి రైలు రవాణాను ఎంచుకున్నారు. దీనివల్ల ప్రతి రైలు ద్వారా సుమారు రూ. 40 లక్షల ఆదాయం చేకూరనుంది. ప్రతికూల రవాణా ఖర్చు తగ్గుతుండడంతో ఏటా 1.5 లక్షల టన్నుల మేర సరుకు రైళ్ల ద్వారానే సరఫరా అవుతుందని, దీనివల్ల రైల్వే శాఖకు ఏటా రూ. 20 కోట్ల అదనపు రాబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande