తెలంగాణలో 23 నుంచి 26 వరకు భారీ వర్షాలకు అవకాశం
రాష్ట్రంలో సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rain


హైదరాబాద్ , 20 సెప్టెంబర్ (హి.స.)

రాష్ట్రంలో సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్లో ఇప్పటివరకు వర్షపాతం సాధారణ స్థాయిలో లేకపోవడంతో వ్యవసాయం, సాగునీరు, భూగర్భజలాలపై ప్రభావం ఉంటుందా అనే అంశంపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. ఆదివారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్నగర్, నారాయణపేట ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు పేర్కొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారిక అంచనా తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande