
అమరావతి , 20 సెప్టెంబర్ (హి.స.)ఏపీ రాష్ట్రంలోని యువత తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కలిశారు. ఈ సందర్బంగా వినాయకుని నిమజ్జనాల్లో డీజే పర్మిషన్ ఇవ్వాలంటూ కోరారు. అయితే, ఉండి నియోజకవర్గంలో వినాయక నిమజ్జనాల్లో డీజే సౌండ్స్కు నో పర్మిషన్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే, యువత డీజే సౌండ్స్ లేకుండా వినాయక చవితి నిమజ్జనం చేసుకుంటామని తెలిపారు. డీజే సౌండ్స్కు ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. సౌండ్ పొల్యూషన్ లేకుండా వినాయక నిమజ్జనాలు చేసుకోవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్