

హైదరాబాద్ , 25 సెప్టెంబర్ (హి.స.)హిందూ ధర్మ పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) మాజీ అంతర్జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ అశోక్ సింఘాల్ జన్మ శతాబ్ది ఉత్సవాలను హైదరాబాద్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. విశ్వహిందూ పరిషత్ - తెలంగాణ ప్రాంతం ఆధ్వర్యంలో ఈ వేడుకలను అక్టోబర్ 4, 2026 ఆదివారం రోజున నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని కర్మాన్ఘాట్ హనుమాన్ ఆలయం దగ్గర ఉన్న ఎస్.వై.ఆర్. కన్వెన్షన్ హాల్ (RCI రోడ్డు) ఈ వేడుకలకు వేదికైంది.
అక్టోబర్ 4న సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ చారిత్రాత్మక వేడుకకు దేశ రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు హాజరుకానున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. అలాగే విశ్వహిందూ పరిషత్ కేంద్ర ఉపాధ్యక్షులు శ్రీ చంపత్ రాయ్ ఈ సభకు ముఖ్య వక్తగా హాజరై అశోక్ సింఘాల్ జీవిత విశేషాలను, ధర్మ ప్రచారంలో ఆయన చేసిన సేవలను ప్రజలకు వివరించనున్నారు. హిందూ సమాజాన్ని జాగృతం చేయడంలో, రామజన్మభూమి ఉద్యోగంలో అశోక్ సింఘాల్ అందించిన సేవలు చిరస్మరణీయమని నిర్వాహకులు తెలిపారు. ఈ శతజయంతి ఉత్సవాలకు ధర్మాభిమానులు, వీహెచ్పీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజై విజయవంతం చేయాలని శ్రీ అశోక్ సింఘాల్ జన్మ శతాబ్ది స్వాగత సమితి కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్